||సుందరకాండ ||

||అరువది ఆరవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 66 || with Slokas and meanings in Telugu

 

సుందరకాండ.
అథ షట్షష్టితమస్సర్గః||

శ్లో|| ఏవముక్తో హనుమతా రామో దశరథాత్మజః|
తం మణిం హృదయే కృత్వా ప్రరురోద సలక్ష్మణః||1||

స|| హనుమతా ఏవం ఉక్తః రామః దశరథాత్మజః స లక్ష్మణః తం మణిం హృదయే కృత్వా ప్రరురోద||

తా|| హనుమంతునిచేత ఈ విధముగా చెప్పబడిన దశరథాత్మజుడైన రాముడు లక్ష్మణునితో కలిసి ఆ మణిని హృదయమునకు హత్తుకొని విలపించెను.

శ్లో|| తం తు దృష్ట్వా మణిశ్రేష్ఠం రాఘవః శోకకర్శితః|
నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవమిదమబ్రవీత్||2||

స|| శోకకర్శితః రాఘవః తం మణిశ్రేష్ఠం దృష్ట్వా అశ్రుపూర్ణాభ్యాం నేత్రాభ్యాం సుగ్రీవం ఇదం అబ్రవీత్||

తా|| ఆ శ్రేష్ఠమైన మణిని చూచి శోకములో మునిగినవాడై నీళ్ళతో నిండిన కళ్ళతో సుగ్రీవునితో ఇట్లు పలికెను.

శ్లో|| యథైవ ధేనుః స్రవతి స్నేహాత్ వత్సస్య వత్సలా|
తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్||3||

స|| యథా వత్సస్య స్నేహాత్ ధేనుః స్రవతి తథిఅవ మమ హృదయం మణిరత్నస్య దర్శనాత్ ||

తా|| 'ఏ విధముగా ధేనువు తన దూడను చూడగానే వాత్సల్యముతో క్షీరమును ద్రవించునో ఆ విధముగా ఈ మణిరత్నమును చూచి నాహృదయము ద్రవించుచున్నది'.

శ్లో|| మణిరత్నమిదం దత్తం వైదేహ్యాః శ్వశురేణ మే|
వధూకాలే యథాబద్ధం అధికం మూర్ధ్ని శోభతే ||4||

స||మే ఇదం మణిరత్నం మే వైదేహ్యాః శ్వశురేణ దత్తం | వధూకాలే యథాబద్ధం మూర్ధ్ని అధికం శోభతే||

తా||'ఈ మణి రత్నమును విదేహమహరాజు అయిన నా మామగారిచేత ఇవ్వబడినది. వివాహ సమయములో అది తలపై ధరించబడినపుడు అత్యధికముగా శోభించెన'.

శ్లో|| అయం హి జలసంభూతో మణి సజ్జనపూజితః|
యజ్ఞే పరమతుష్టేన దత్తః శక్రేణ ధీమతా||5||

స|| అయం జలసమ్భూతః మణిః సజ్జనపూజితః యజ్ఞే పరమతుష్ఠేన ధీమతా శక్రేణ దత్తః||

తా||'జలమునుంచి ఉద్భవించిన ఈ మణి సజ్జనులచే పూజింపబడినది. ఒక యజ్ఞములో ఆనందభరితుడైన ఇంద్రుని చేత ఇవ్వబడినద'.

శ్లో|| ఇమం దృష్ట్వా మణిశ్రేష్ఠం యథా తాతస్య దర్శనమ్|
అద్యాsస్మ్యవగతః సౌమ్య వైదేహస్య తథా విభోః||6||

స|| సౌమ్య ఆద్య ఇమం మణిశ్రేష్ఠం దృష్ట్వా యథా తాతస్య దర్శనమ్ తథా విభోః వైదేహ్యాః చ అవగతః ||

తా||'ఓ సౌమ్యుడా ! ఇప్పుడు ఈ శ్రేష్ఠమైన మణి ని చూచి తండ్రి గారి దర్శనము ఆలాగే పూజ్యుడైన విదేహమహరాజును చూచినట్లు అనిపించుచున్నద'.

శ్లో|| అయం హి శోభతే తస్యాః ప్రియయా మూర్ధ్ని మే మణిః|
అస్యాద్య దర్శనే నాహం ప్రాప్తాం తాం ఇవ చింతయే||7||

స|| అయం మణిః తస్యాః ప్రియాయాః మూర్ధ్ని హి శోభతే || అస్య ఆద్య దర్శనేన అహం తాం ప్రాప్తాం ఇవ చింతయే ||

తా||'ఈ మణి నాప్రియురాలైన సీత శిరస్సునందే శోభించును. దీనిని ఇప్పుడు చూచి నేను ఆమెను పొందితినా అని అనిపించుచున్నద'.

శ్లో|| కిమహా సీతా వైదేహీ బ్రూహి సౌమ్య పునః పునః|
పిపాసుమివ తోయేన సించంతీ వాక్యవారిణా||8||

స|| సౌమ్య ! పిపాసుమ్ త్ఫ్యేన ఇవ వైదేహి వాక్యవారిణా సించన్తీ | సీతా కిం ఆహ పునః పునః బ్రూహి ||

తా|| 'ఓ సౌమ్యుడా ( హనుమా!) దప్పికగలవానికి నీరులాగ వైదేహి వాక్యములను వినిపించుము. సీత ఏమి అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుము'.

శ్లో|| ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారిసంభవమ్|
మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీ మాగతం వినా||9||

స|| సౌమిత్రే వైదేహీం ఆగతం వినా యత్ ఇమం వారిసంభవమ్ మణిం పశ్యామి ఇతస్తు దుఃఖతరం కిమ్ ||

తా|| 'ఓ సౌమిత్రీ ! వైదేహి లేకుండా ఈ నీటిలో పుట్టిన మణి ని చూచుటకన్నా దుఃఖము కలిగించునది ఏమి?'

శ్లో|| చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి|
క్షణం సౌమ్య న జీవేయం వినా తా మసితేక్షణా||10||

స|| సౌమ్య యది మాసం ధరిష్యతి వైదేహీ చిరం జీవతి |అసితేక్షణా వినా క్షణం న జివేయం||

తా|| 'ఓ సౌమ్యుడా ! వైదేహి ఒక మాసము జీవించినచో చిరకాలము జీవించును. నల్లని కనులు గల సీత లేకుండా నేను ఒక క్షణము కూడా జీవించలేను'.

శ్లో|| నయ మామపి తం దేశం యత్ర దృష్టా మమప్రియా|
న తిష్ఠేయం క్షణమపి ప్రవృత్తి ముపలభ్య చ||11||

స||యత్ర మమప్రియా దృష్టా తం దేశం మామ్ అపి నయ | ప్రవృత్తిం ఉపలభ్య క్షణం అపి న తిష్ఠేయం ||

తా|| ' ఏక్కడ నా ప్రియురాలు ఉన్నదో ఆ దేశమునకు నన్ను తీసుకొని పొమ్ము. ఆమె పరిస్థితి తెలిసిన తరువాత ఓక క్షణము కూడా నిలువజాలము'.

శ్లో|| కథం సా మమ సుశ్రోణీ భీరు భీరుస్సతీ సదా|
భయావహానాం ఘోరాణాం మధ్యే తిష్ఠతి రక్షసామ్||12||

స|| సా సుశ్రోణీ భీరుభీరుః సతీ భయావహానాం ఘోరాణాం రక్షసాం కథం మధ్యే తిష్ఠతి ... ||

తా|| 'ఆ సుందరాంగీ భయపడునదీ అగు సీత భయంకరులైన ఘోరముగా వుండు రాక్షసులమధ్యలో ఏట్లు ఉండును'.

శ్లో|| శారదః తిమిరోన్ముక్తో నూనం చంద్ర ఇవాంబుదైః|
ఆవృతం వదనం తస్యా న విరాజతి రాక్షసైః||13||

తా|| 'శరత్కాలచంద్రబింబము లాంటి ఆమె వదనము నీటితో నిండిన మేఘములతో కప్పబడిన చంద్రునివలె, రాక్షసులచేత చుట్టబడి, ప్రకాశించదు'.

శ్లో|| కిమాహా సీతా హనుమంస్తత్త్వతః కథ యాద్య మే|
ఏతేన ఖలు జీవిష్యే భేషజే నాతురో యథా||14||

స|| హనుమాన్ మే అద్య సీతా కిమ్ ఆహ తత్త్వతః కథయ | ఏతేన జీవిష్యే ఖలు యథా భేషజేన ||

తా|| 'ఓ హనుమా ! ఇప్పుడు సీత ఏమి చెప్పినదో యథా తథముగా చెప్పుము. ఆ మాటలతో ఔషధము సేవించినవాని వలె జీవించెదను'.

శ్లో|| మధురా మధురాలాపా కి మాహ మమ భామినీ|
మద్విహీనా వరారోహా హనుమన్ కథయస్వ మే||15||

స|| మథురా మథురాలాపా వరారోహా మత్ విహీనా మమభామినీ కిం ఆహ | కథయస్వ|

తా|| 'మధురమైన మధురముగా మాట్లాడు స్త్రీరత్నము నా వియోగములో నున్న నా భామిని ఏమి చెప్పెను?. చెప్పుము'.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షట్షష్టితమస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఆరవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||